US-IRAN WAR: అమెరికా దగ్గర తగ్గుతున్న ఆయుధ నిల్వలు.. ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్..!
మాదగ్గర చాలా ఆయుధాలున్నాయి.. ఎన్నిరోజులైనా దీర్ఘకాలికయుద్ధం చేయడానికి మేం సిద్ధమన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు.. ఇజ్రాయెల్ తో కలిసి భూపోరాటం చేస్తామని హుంకరించారు. కానీ వాస్తవం అలా లేదు.. ఎందుకంటే ఈ సంచలన విషయాన్ని పెంటగాన్ నివేదిక వెల్లడించింది. క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నట్లు (Low Missile Stock) పెంటగాన్ తెలిపింది. ముఖ్యంగా ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రంప్ మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆయుధ, క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకోవడానికి అధిక ఖర్చులను భరించాల్సి ఉంటుందని పెంటగాన్ ట్రంప్‌నకు తెలిపినట్లు నివేదికలు వెల్లడించాయి. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పి కొట్టడం కూడా అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించాయి. కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్రదేశాలకు సైనిక సహాయం అందిస్తుండడంతో.. అమెరికా నిల్వలు తగ్గినట్టు తెలిపాయి.
ఇవి కూడా చదవండి

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమైనట్లు (Trump Calls Urgent Meet) తెలుస్తోంది. ఆయుధ ఉత్పత్తిని త్వరిత గతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణరంగ కాంట్రాక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను అమెరికా (US) అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ట్రంప్ వారితో భేటీ కానున్నట్లు పేర్కొన్నాయి.
ఇరాన్‌తో కొనసాగుతోన్న యుద్ధంలో భారీగా క్షిపణులను వినియోగించడంతో.. తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని (Low Missile Stock) తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సహాయం అందిస్తుండడంతో.. ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినట్టు తెలుస్తోంది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంటగాన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి








