Supreme Court: క్రీమీలేయర్ లెక్కల్లో మార్పు.. హోదాను చూడాల్సిందేనన్న సుప్రీంకోర్టు
Supreme Court: దేశంలో ఓబీసీ (OBC) రిజర్వేషన్ల అమలులో కీలకమైన క్రీమీలేయర్ నిబంధనలపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఓబీసీ కేటగిరీని క్రీమీలేయర్ , నాన్-క్రీమీలేయర్ అని రెండుగా విభజించారు. ఎవరి వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే ఎక్కువగా (జీతం , వ్యవసాయ ఆదాయం మినహాయించి) ఉంటుందో వారిని క్రీమీలేయర్గా పరిగణిస్తారు. వీరికి రిజర్వేషన్లు వర్తించవు. ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారిని నాన్-క్రీమీలేయర్గా గుర్తించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు , ఉన్నత విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
అయితే, క్రీమీలేయర్ హోదాను కేవలం తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆధారంగానే నిర్ణయించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆదాయంతో పాటు వారు పనిచేసే సంస్థల్లోని హోదా , పదవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లేదా పొరపాటున క్రీమీలేయర్ జాబితాలో చేరడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు కోర్టు పెద్ద ఊరటనిచ్చింది. అభ్యర్థుల నియామకాలను నిరాకరిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలను సరైన రీతిలో అన్వయించి అర్హులైన వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి








