బెంగాల్ బీజేపీ కార్యాలయంలోనే కూర్చున్న అమిత్ షా..
బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అత్యంత హింసాత్మక ఘర్షణలే చోటు చేసుకున్నాయి. ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి తాము అధికారాన్ని చేపట్టాలని బీజేపీ దృఢ సంకల్పంతో వుంది. అత్యంత చురుగ్గా వ్యవహరిస్తోంది. బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందంటే.. పోలింగ్ సమయంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కలకత్తాలోనే వున్నారు. కలకత్తాలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వుంటూ, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కేడర్ కి దిశా నిర్దేశం చేస్తున్నారు. నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు రాష్ బిహారీ అనే నియోజకవర్గంలో అత్యంత ప్రముఖమైన కాళీఘాట్ ఆలయాన్ని కూడా అమిత్ షా సందర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, చాలా నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు వున్నాయి. సరిగ్గా అదే ప్రాంతాన్ని అమిత్ షా సందర్శించారు.
మొదటి దశ జరగనున్న ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాన్ని సాధించినవే. దీనికి భిన్నంగా టీఎంసీ అత్యంత శక్తిమంతమైన శక్తిగా అవతరించిన ప్రాంతాలలో ఇక రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఉదాహరణకు, కోల్‌కతాను తీసుకుంటే—గత ఎన్నికల్లో ఆ నగరంలోని మొత్తం 11 స్థానాలను TMC కైవసం చేసుకుంది.పోలింగ్ సందర్భంగా రాస్ బిహారీ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. 2011 నుంచి టీఎంసీ ఈ స్థానంలో వుంది. సోహన్ దేవ్ ఛటోపాధ్యాయ నాలుగు సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా వున్నారు. దీనిని అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి.
బీజేపీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా అమిత్ షాయే స్వయంగా రంగంలోకి దిగారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే కూర్చొని, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేశారు. అలాగే రెండో విడత పోలింగ్ పై కూడా ఇప్పుడే దృష్టి సారించారు. కార్యకర్తలు బూత్ లెవల్ లో ఎలా పనిచేయాలి? ఏయే స్థానాలపై కార్యకర్తలు ఎక్కుగా దృష్టి పెట్టాలో కూడా సూచించారు.
ఇవి కూడా చదవండి








