US Air Force: అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. ఇరాన్ యుద్ధంలో 16 యుద్ధ విమానాలు ఖతం!
US Air Force: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వైమానిక దళం భారీ నష్టాలను చవిచూసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన సుమారు 16 యుద్ధ విమానాలు , డ్రోన్లు కూలిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధికంగా నిఘా , దాడులకు ఉపయోగించే డ్రోన్లే ఉన్నాయని సమాచారం.
డ్రోన్ల విధ్వంసం: అమెరికాకు చెందిన 10 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రు దళాలు కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఇందులో తొమ్మిది డ్రోన్లు గాలిలోనే ధ్వంసం కాగా, ఒకటి జోర్డాన్‌లోని విమానాశ్రయంలో ఉండగా క్షిపణి దాడికి గురైంది. తక్కువ ఖర్చు, పైలట్ అవసరం లేకపోవడంతో వీటిని ఎక్కువగా యుద్ధ క్షేత్రాల్లో వాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్రెండ్లీ ఫైర్: కువైట్‌లో జరిగిన దురదృష్టకర ‘ఫ్రెండ్లీ ఫైర్’ (సొంత దళాల పొరపాటు దాడి) ఘటనలో అమెరికాకు చెందిన మూడు F-15 యుద్ధ విమానాలు కూలిపోయాయి.
రీఫ్యూయలింగ్ విమానాలు: ఇరాక్ , సౌదీ అరేబియాలో అమెరికాకు గట్టి దెబ్బ తగిలింది. ఇరాక్‌లో ఒక KC-135 రీఫ్యూయలింగ్ విమానం కూలిపోగా, ఆరుగురు సిబ్బంది మరణించారు. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో మరో ఐదు KC-135 విమానాలు దెబ్బతిన్నాయి.
ఇరాన్ రక్షణ వ్యవస్థ: ఇరాన్ తన అధునాతన రక్షణ వ్యవస్థల ద్వారా ప్రధానంగా మానవరహిత రీపర్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేసినట్లు నివేదిక పేర్కొంది.








