Iran-Israel: క్షీణించిన ఇరాన్ సైనిక శక్తి.. అణుకల ఇక కల్లే: నెతన్యాహు
Iran-Israel : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఆయన వెల్లడించారు.
మూడు లక్ష్యాలు: ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించడం, వారి సైనిక శక్తిని అణచివేయడం , అక్కడి ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడమే తమ ప్రధాన ఉద్దేశమని నెతన్యాహు స్పష్టం చేశారు.
ట్రంప్ సూచనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు తాము నడుచుకుంటామని, అయితే ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై దాడి నిర్ణయం ఇజ్రాయెల్ స్వయంగా తీసుకుందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి

అంతర్గత విభేదాలు: ఇరాన్ పాలక వర్గంలోనూ, సైన్యంలోనూ చీలికలు వచ్చాయని, ప్రస్తుతం ఆ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో కూడా స్పష్టత లేదని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధి: చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ఫలించవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సరదా వ్యాఖ్యలు: తన మరణం గురించి వస్తున్న పుకార్లపై స్పందిస్తూ.. “నేను బతికే ఉన్నాను, అందుకు మీరే సాక్ష్యం” అని నెతన్యాహు చమత్కరించారు.
చివరగా, ఈ యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్ కూటమిదే విజయమని, ఇరాన్ పతనం తప్పదని నెతన్యాహు విదేశీ మీడియాతో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








