ఓర్లాండోలో ‘నాట్స్’ తెలుగు సంగమం.. ఏప్రిల్ 25న వేడుకలు!
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఓర్లాండో చాప్టర్ ఆధ్వర్యంలో ‘తెలుగు సంగమం’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: ఏప్రిల్ 25, 2026 (శనివారం).
- సమయం: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు.
- వేదిక: 17709 Lake Hancock Blvd, Winter Garden, FL 34787.
నిర్వాహక బృందం..
ఈ వేడుకను NATS చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి పర్యవేక్షణలో ఓర్లాండో చాప్టర్ టీమ్ నిర్వహిస్తున్నారు
- చాప్టర్ కోఆర్డినేటర్: రవి కుమార్ రవి
- జాయింట్ కోఆర్డినేటర్: వేణు మల్ల
- ఉమెన్స్ కోఆర్డినేటర్: శ్రీదేవి మల్ల
- సెక్రటరీ/ZVP: సుమంత్ రామినేని
కమ్యూనిటీ సర్వీసెస్ నుండి గోలి శ్రీధర్, ఈవెంట్ ఎగ్జిక్యూషన్ నుండి రాజశేఖర్ అంగ, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చంద్ర అచంట తదితరులు ఈ కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.
తెలుగు వేడుక..
ఓర్లాండో , పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలందరూ ఈ ‘తెలుగు సంగమం’లో పాల్గొని విజయవంతం చేయాలని నాట్స్ ప్రతినిధులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం నాట్స్ హెల్ప్‌లైన్ +1-888-4-TELUGU లేదా help-line@natsworld.org ద్వారా సంప్రదించవచ్చు.








