ATA: ఆటా బాల్టిమోర్ మహాసభలపై పెన్సిల్వేనియాలో కీలక భేటీ
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా-డెలావేర్ (PA-DE) బృందం కీలక సమావేశాన్ని నిర్వహించింది. పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీలాండ్, వర్జీనియా రాష్ట్రాల నుంచి దాదాపు 50 మంది ఆటా సభ్యులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రీజినల్ డైరెక్టర్ అరుణ్ రుద్ర నివాసంలో జరిగిన ఈ భేటీ.. రాబోయే ఆటా బోర్డు మీటింగ్, బాల్టిమోర్ (Baltimore) వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఆటా మహాసభలకు దిశానిర్దేశం చేసింది.
ఈ సమావేశంలో ప్రధానంగా మహాసభల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ (Fundraising), ఇతర ఏర్పాట్లపై లోతుగా ఆటా (ATA) నేతలు చర్చించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి చల్లా, జీనత్ కుందూరు, రవి పులి ప్రత్యేక అతిథులుగా హాజరై సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపారు. సమిష్టి కృషితో బాల్టిమోర్ సభలను విజయవంతం చేయాలని జయంత్ చల్లా పిలుపునిచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ కార్యక్రమంలో ఆటా (ATA) బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు కక్కెర్ల, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, హను తిరుమల్, కిరణ్ ఆల, అరుణ్ రుద్ర, వేణుగోపాల్ రెడ్డి, వంశీ యెంజాల తదితరులతో పాటు స్టాండింగ్ కమిటీ చైర్లు, స్థానిక కమ్యూనిటీ లీడర్లు రెహమాన్, సురేష్, ఆనంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. టీమ్ వర్క్‌తో కాన్ఫరెన్స్ లక్ష్యాలను సాధిస్తామని ఆటా (ATA) నేతలు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన అరుణ్ రుద్రకు కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.






