‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే పదం పాపులారిటీ పొందక ముందే చాలా మంది యాక్టర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు. దాదాపు రెండు దశాబ్దాల ముందే ఆర్య, హ్యాపీ, బన్నీ, దేశముదురు వంటి సినిమాల మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా అక్కడి ప్రేక్షకులతో ఆయకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
మలయాళ టీవీ చానెల్స్‌లో తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ ప్రసారమవుతున్న సమయంలోనే అల్లు అర్జున్ తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజన్స్, స్టైలిష్ యాక్టింగ్, డాన్స్ మూవ్స్, అందరికీ కనెక్ట్ అయ్యే రొమాంటిక్ పాత్రలతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్గా మలయాలంలో రీరిలీజైన హ్యపీ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కేరళలోని బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే అవి పుష్ప సినిమా కంటే ముందే మొత్తం పాన్ ఇండియా యుగానికి ముందే ఏర్పడిన అభిమానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
నార్త్ ఇండియాలో భారీ ఫినామన క్రియేట్ చేసిన పుష్ప 2 ఇంకా కొనసాగుతుండగానే.. కేరళలో మాత్రం 19 సంవత్సరాల క్రితం విడుదలైన పాత డబ్బింగ్ సినిమా దీన్నొక ఈవెంట్‌గా మార్చింది. దీంతో అల్లు అర్జున్‌కి వచ్చిన క్రేజ్ ఒక ఫ్రాంచైజీ వల్ల కాదు.. దశాబ్దాల పాటు క్రమంగా పెరుగుతూ వచ్చిందని నిరూపించింది. మలయాళంలో హ్యాపీ బీ హ్యాపీగా డబ్ అయిన హ్యాపీ సినిమా రీ-రిలీజ్ సమయంలో సెన్సేషన్ సృష్టించింది. హౌస్‌ఫుల్ షోలు, పాటలకి ప్రేక్షకులు చేసిన హంగామా, అల్లు అర్జున్ మేనరిజమ్స్‌కి వచ్చిన స్పందన.. అలాగే అతని అద్భుతమైన కామిక్ టైమింగ్‌కి ప్రేక్షకులు మురిసిపోవడం ఇవన్నీ కలిసి హ్యాపీ సినిమా మళ్లీ ఒక పండుగలా మారిపోయింది.
కేరళలో అల్లు అర్జున్‌పై ఫ్యాన్స్ చూపించిన ప్రేమ.. మరో ఇండస్ట్రీకి చెందిన నటుడికి సాధారణంగా కనిపించని స్థాయిలో ఉంది. అభిమానులే ఆయనకు స్వయంగా ‘మల్లు అర్జున్’అనే బిరుదు పెట్టడం కూడా ఈ ప్రత్యేక అనుబంధానికి నిదర్శనం. ఈ భావోద్వేగ బంధం కాలక్రమేణా మరింత బలపడింది. టీవీలో అతని సినిమాలు చూసినవారు.. ఇప్పుడు థియేటర్లలో వాటిని సెలబ్రేట్ చేస్తూ వచ్చాయి. హ్యాపీ రీ రిలీజ్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన ఒక అరుదైన అచీవ్మెంట్ను హైలైట్ చేస్తోంది.
అల్లు అర్జున్ ప్రేక్షకులపై చూసిన ప్రభావం అక్కడికే పరిమితం కాలేదు. మలయాళ సినీ పరిశ్రమపైన కూడా పడింది. గత కొన్ని సంవత్సరాల్లో, చాలా మంది మాలీవుడ్ యాక్టర్స్ తమ చిన్ననాటి రోజుల్లో అల్లు అర్జున్ సినిమాలు చూసి ప్రేరణ పొందినట్టు, ఆయనపై అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా బన్నీ డాన్స్ పర్ఫార్మెన్స్లు, స్టైలిష్ పాత్రలు, యాక్షన్ సీన్లు, స్క్రీన్ చరిష్మా.. ఇవి అన్నీ కేరళలోని ఒక తరం యువ ప్రేక్షకులకు, నటులుగా మారాలని ఆశపడుతున్న వారికి ఒక బెంచ్‌మార్క్‌లా మారాయి.
ఆర్య, హ్యాపీ వంటి సినిమాల ప్రాచుర్యం కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లకే పరిమితం కాలేదు.. అది ఒక సాంస్కృతిక ప్రభావంగా మారి, అల్లు అర్జున్ను మలయాళ కుటుంబాల్లో సన్నిహితంగా, ఎంతో ఇష్టపడే వ్యక్తిగా నిలబెట్టింది. హ్యాపీ మలయాళ రీ రిలీజ్ విజయమనేది ఏ బాక్సాఫీస్ సంఖ్యలతోనూ కొలవనిదిగా మారింది. ఎందుకంటే అది ప్రేక్షకుల భావోద్వేగ అనుబంధం, విశ్వాసం, మరియు సంవత్సరాలుగా కొనసాగుతున్న స్టార్‌డమ్‌ను ప్రతిబింబిస్తుంది. దీంతో అల్లు అర్జున్ నిజంగా దేశవ్యాప్తంగా భారీ అభిమానాన్ని సంపాదించిన అసలైన పాన్ ఇండియా స్టార్‌గా మారారు.








