Flight Charges: కేంద్రం సంచలన నిర్ణయం, విమాన ప్రయాణం కష్టమే..!
గత ఏడాది నుంచి, భారత విమానయాన రంగంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశీయ విమాన ప్రయాణ (Flight Charges)చార్జీలపై గతంలో ఉన్న గరిష్ట మరియు కనిష్ట ధరల పరిమితులను (Airfare Caps) మార్చి 23 నుండి ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల దేశంలో తలెత్తిన ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం నేపథ్యంలో విమానయాన రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తీవ్ర సాంకేతిక, నిర్వహణ లోపాలను ఎదుర్కొంది.
దీనివల్ల వందలాది విమానాలు రద్దు కావడం, వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచాయి. కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనితో విమానయాన మార్కెట్లో సమతుల్యతను కాపాడటానికి, పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం చార్జీల పరిమితులను తొలగించింది. ఇప్పటివరకు ప్రభుత్వం విమాన చార్జీలపై ఒక ‘ఫ్లోర్ ప్రైస్’ (కనిష్ట ధర), ‘క్యాప్’ (గరిష్ట ధర)ను విధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ నిబంధనలు ఉండవు.
ఇకపై విమానయాన సంస్థలే డిమాండ్ మరియు సరఫరాను బట్టి టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు. ధరల పరిమితులను ఎత్తివేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎయిర్లైన్స్ సంస్థలకు పలు హెచ్చరికలు చేసింది. ఎక్సర్సైజ్ ప్రైసింగ్ డిసిప్లిన్ అంటే ధరల క్రమశిక్షణ పాటించాలని సూచించింది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని విపరీతమైన ధరలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. సంక్షోభ సమయాల్లో సామాన్యులపై భారం పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఒకవేళ సంస్థలు అడ్డగోలుగా ధరలు పెంచితే ప్రభుత్వం మళ్లీ జోక్యం చేసుకునే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించింది. ఈ నిర్ణయం పండుగలు, సెలవులు లేదా విమానాల రద్దు వంటి అత్యవసర సమయాల్లో చివరి నిమిషంలో టికెట్లు కొనేవారిపై భారం పడే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి








