Airlines: 60 శాతం ‘ఉచిత సీట్ల’ నిబంధనపై ఎయిర్‌లైన్స్ అక్కసు
విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లపై ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు (సీట్ సెలక్షన్) ఛార్జీలు వసూలు చేయకూడదని పౌరవిమానయాన నియంత్రణ సంస్థ (DGCA) జారీ చేసిన ఆదేశాలను దేశీయ విమానయాన సంస్థలు (Airlines) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
టికెట్ ధరలు పెంచక తప్పదు..
ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ తదితర అగ్రగామి సంస్థలకు (Airlines) ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (FIA) ఈ మేరకు పౌరవిమానయాన శాఖకు ఒక ఘాటు లేఖ రాసింది. కేంద్రం జారీ చేసిన ఈ ఉచిత సీట్ల ఆదేశాలు తమ సంస్థల కీలక ఆదాయ మార్గాలకు గండికొడతాయని ఎఫ్ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధన వల్ల ఎయిర్‌లైన్స్‌పై పడే తీవ్ర ఆర్థిక భారాన్ని పూడ్చుకోవడానికి, అనివార్యంగా బేస్ టికెట్ ధరలను (Base Fares) పెంచాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
సామాన్య ప్రయాణికుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. పెరిగే టికెట్ ధరల రూపంలో అది చివరికి వారికే ప్రతికూలంగా మారుతుందని, ముఖ్యంగా తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారికి ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని ఎఫ్ఐఏ (Airlines) హెచ్చరించింది.
డీజీసీఏకు ఆ అధికారం లేదు..
అంతేకాకుండా, తమ వ్యాపార నిర్ణయాల్లో డీజీసీఏ జోక్యం చేసుకోవడంపై ఎఫ్ఐఏ (Airlines) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విమానంలో ఏ సీటుకు ఎంత ధర నిర్ణయించాలి, సీట్ల కేటాయింపు ఎలా చేయాలనేవి పూర్తిగా విమానయాన సంస్థల అంతర్గత వాణిజ్య నిర్ణయాలని కుండబద్దలు కొట్టింది. అన్‌బండిల్డ్ సేవల (టికెట్ బేస్ ధర కాకుండా అదనపు సదుపాయాలు) ఛార్జీలను నియంత్రించే చట్టపరమైన అధికారం డీజీసీఏకు లేదని తేల్చిచెప్పింది. అలాగే ఈ కీలక నిర్ణయం తీసుకునే ముందు తమతో చర్చలు జరిపారన్న వాదనలను సైతం ఫెడరేషన్ (Airlines) తీవ్రంగా ఖండించింది. విమానయాన రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్న ఈ వివాదాస్పద ఆదేశాలను తక్షణమే పునఃపరిశీలించి, వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్ఐఏ విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి







