టెక్ దిగ్గజాలకు ‘మిథోస్’ సెగ.. వేలాది సాఫ్ట్వేర్ లోపాలు గుర్తింపు!
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆంత్రోపిక్, తాజాగా అభివృద్ధి చేసిన ‘క్లాడ్ మిథోస్’ (Claude Mythos) మోడల్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్లు , వెబ్ బ్రౌజర్లలో వేలాది తీవ్రమైన భద్రతా లోపాలను ఈ ఏఐ మోడల్ గుర్తించడమే ఇందుకు కారణం. రక్షణాత్మక సైబర్ సెక్యూరిటీ అవసరాల కోసం దీనిని రూపొందించినప్పటికీ, దీని సామర్థ్యాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
మోడల్ యాక్సెస్..
ఏప్రిల్ 7న ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా , ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలకు మిథోస్ మోడల్ యాక్సెస్ కల్పించారు.సాఫ్ట్వేర్ సంస్థలు తమ లోపాలను సరిదిద్దే లోపే, ఈ మోడల్ కొత్త బలహీనతలను గుర్తించి వాటిని ఉపయోగించుకోగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకింగ్ రంగాలపై..
దశాబ్దాల నాటి సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడే బ్యాంకింగ్ వంటి కీలక రంగాలపై ఈ మోడల్ ద్వారా అధునాతన సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిథోస్ ఏఐకి ఉన్న స్వయంప్రతిపత్తి , అధునాతన కోడింగ్ సామర్థ్యాలు, భద్రతా వ్యవస్థలను ఛేదించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుండటమే ప్రస్తుత ఆందోళనకు ప్రధాన కారణం.
ఇవి కూడా చదవండి








