SKT Gold & Diamond Store: ప్రారంభమైన ఎస్ కె టి గోల్డ్, డైమండ్స్ స్టోర్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఎస్ కె టి గోల్డ్, డైమండ్స్ తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రముఖ సినీ నటి శ్రీయ శరణ్ ప్రారంభించారు. అభిమానులు, బిజినెస్ ప్రముఖుల మధ్య ఆమె ఈ స్టోర్ ను ప్రారంభిస్తూ అద్భుతమైన డిజైన్లతో ఈ స్టోర్ ను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ స్టోర్ యజమానులైన కృష్ణ కస్వ, స్వప్న క్వస్వ దంపతులు, వారి భాగస్వాములు, బంధుమిత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రియశరణ్ ను స్వప్న క్వస్వతోపాటు వారి కుమార్తె శ్రేష్ట క్వస్వ, వారి భాగస్వాములు చందనగంధె, అనితాగంధె, కోడలు సృజన గంధె తదితరులు ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా స్వప్న క్వస్వ మాట్లాడుతూ, తాము అమెరికాలో ఇన్నాళ్ళు నివసించామని, ఇప్పుడు హైదరాబాద్ కు తరలి వచ్చి ఈ బిజినెస్ ను ప్రారంభించామని చెప్పారు. అత్యున్నతమైన శ్రేణిలో, అద్భుతమైన డిజైన్లతో బంగారు నగలు, వజ్రాభరణాలను నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. సంప్రదాయ మరియు ఆధునిక శైలి కలబోతగా ఉండే మా ప్రత్యేక కలెక్షన్స్ అందరికీ నచ్చుతుందని చెప్పారు. ఈ స్టోర్ కు మీరు కూడా వచ్చి మా డిజైన్లను పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.








