రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ లోని రాజ్యసభ హాల్ లో చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేం నరేందర్రెడ్డి భగవంతుడిపై విశ్వాసం చూపుతూ ఇంగ్లిష్ లో ప్రమాణం చేశారు. తెలంగాణ హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎంపీ వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సోనియా (Sonia), రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలు, రాష్ట్ర హక్కులు, నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్లో పోరాడతానని అన్నారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తానని చెప్పారు.
కాగా, వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, సీతక్కతోపాటు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి








