Rajya Sabha; రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం
తెలంగాణలో కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మనూ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి నియామకాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి (Upender Reddy) ప్రకటించారు. అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వేం నరేందర్రెడ్డి వచ్చి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ధ్రువపత్రాన్ని స్వీకరించారు. సింఘ్వీ తరపున ఆయన న్యాయవాది సురేందర్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు విజయరమణారావు, శ్రీగణేశ్, నవీన్ యాదవ్, అసెంబ్లీ, మండలి కార్యదర్శులు తిరుపతి, నరసింహాచార్యులు (Nasimhacharya) తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








