రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
తెలంగాణలో నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవులను నెలలోగా భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాంధీ తో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పదవుల భర్తీలో ప్రభుత్వం, పార్టీ మధ్య మరింత సమన్వయం ఉండేలా చూస్తున్నామని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ (OBC) సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని కోరగా, రాహుల్ గాంధీ అంగీకరించారని తెలిపారు. బీసీ సాధికారిత పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని జోడించాలని రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. సర్వేలో ఎలాంటి లోపం జరగలేదని, అత్యంత శాస్ర్తీయ పద్థతిలో వివరాల నమోదు జరిగందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ (KCR) చేసినట్లు హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకోలేదన్నారు.
ఇవి కూడా చదవండి








