Telangana: బియ్యం స్కామ్‌పై హౌస్ కమిటీ వేయాల్సిందే.. శాసనసభలో హరీశ్‌రావు
Harish Rao: తెలంగాణ శాసనసభ వేదికగా బియ్యం ఎగుమతుల అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం రవాణా చేసే ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.
నామినేషన్ పద్ధతిపై ప్రశ్నలు: బియ్యం ఎగుమతి కోసం బహిరంగ టెండర్లు ఎందుకు పిలవలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థ అయిన ‘నాఫెడ్’ (NAFED)కు అవకాశం ఇవ్వకుండా, ఒక ప్రైవేట్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఈ కాంట్రాక్టును ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
వివాదాస్పద సలహాదారు: సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ప్రేమ్‌చంద్ గార్గ్‌ను ప్రభుత్వ సలహాదారుగా ఎలా నియమించుకున్నారని ఆక్షేపించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.
కాకినాడ పోర్టులో నిల్వలు: కాకినాడ పోర్టులో దాదాపు 7,500 టన్నుల బియ్యం నిల్వ ఉన్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వీటికి సంబంధించిన గిడ్డంగి, నిర్వహణ ఖర్చులను ఎవరు చెల్లిస్తున్నారని అడిగారు.
హౌస్ కమిటీకి డిమాండ్: ఈ బియ్యం రవాణా వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడిందని, దీనిపై వాస్తవాలు నిగ్గుతేల్చడానికి వెంటనే ‘హౌస్ కమిటీ’ వేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆ కమిటీలో తనను కూడా సభ్యుడిగా ఉంచాలని కోరారు.








