బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హౌస్ అరెస్ట్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఎన్డీయే (NDA) నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బయటకు రాకుండా తార్నాక (Tarnaka)లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తనను హౌస్ అరెస్టు చేయడం పట్ల రామచందర్ రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.








