ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్ రావు
ఎన్నికైక ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ (Narendra Modi) ఒక చరిత్రాత్మక మైలురాయి అధిగమించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు. 4,399 రోజులు భారతీయ చరిత్రలో స్వరయుగంగా నిలిచిన చరిత్రాత్మక రోజులని చెప్పారు. గరీబ్ కల్యాణ్ నుంచి మహిళా సాధికారత వరకు, రైతుల గౌరవం నుంచి యువతకు అవకాశాల సృష్టి వరకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్ నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం వరకు ప్రతి రంగంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టికల్(Article) 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం (Naxalism) క్షీణత, ఈశాన్య భారతంలో శాంతి, అభివృద్ధి, బలమైన సరిహద్దులు, విసృత్తమైన సామాజిక భద్రతా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన ఆధునికీకరణ, భారత స్టార్టప్ సంస్కృతి ఎదుగుదల, ఇవన్నీ జాతీయ పునరుజ్జీవనానికి కొత్త యుగాన్ని సూచిస్తున్నాయి అని పేర్కొన్నారు.








