వస్తుంటాయి.. పోతుంటాయి..వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు : కేటీఆర్
తెలంగాణలో ఇప్పటి వరకు చాలా పార్టీలు వచ్చాయి. ఇప్పుడవి ఎక్కడున్నాయి? కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆయన స్పందించారు. కేసీఆర్ (KCR) గురించి చాలా మంది చాలా మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోమన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ కాలంగా ఉనికిలో ఉన్నవి టీడీపీ (TDP), ఆ తర్వాత బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని చెప్పారు. పార్టీ పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య మాట్లాడిన మాటలను సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. తమపై విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి మరొక పని చేతకాదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ చతికిలపడి ఎన్నేళ్లైందో చెప్పాలని ఎద్దేవా చేశారు. సీఎం టైంపాస్ మాటలు మాట్లాడుతుంటారని, దిగజారుడు మాటలు మానుకుంటే మంచిదన్నారు.లీకులు ఇవ్వడం ఎందుకు, ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి








