లోక్సభలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? : కేసీఆర్
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని, బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని హెచ్చరించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) మాట్లాడితే బీఆర్ఎస్ పక్షనేత సురేశ్ రెడ్డి (Suresh Reddy) గట్టిగా ఖండించారని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పారని గుర్తుచేశారు. సోనియాగాంధీ ఎన్నోసార్లు చెప్పినా తాను రాజీపడలేదని, అది తన చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








