ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram), అజారుద్దీన్ (Azharuddin) ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








