KTR: డ్రగ్స్ వినియోగంపై.. ఏ పరీక్షకైనా సిద్ధం : కేటీఆర్
డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (Mahesh Goud) సూచనను స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ (Drugs) వాడటం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్ఎస్ ఖండిస్తుందని తెలిపారు. డ్రగ్స్ ను వినియోగించేది ఎంతటివారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టు చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉందాం. డ్రగ్స్ కేసులోకి నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా (Notice) అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








