Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో.. ఎలాంటి రాజకీయం లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు (Drugs Case)పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బృందం సమాధానం చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియతో మాట్లాడుతూ ఈ కేసులో ఈగల్ బృందం తమ కర్తవ్యాన్ని నెరవేర్చిందని, దీనిలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ బృందం దాడులు చేపడుతోంది. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అవసరమైతే డ్రగ్స్ పరీక్షలకు కేటీఆర్ సిద్ధం కావాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ (CM Revanth) కృషి చేస్తున్నారు అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








