Chandrababu: పుట్టా మహేష్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్
తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ (Drugs) కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (Putta Mahesh Kumar) పార్టీ అధిష్థానం ఆదేశించింది. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానీయబోమని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. మహేష్ కుమార్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహేశ్ కు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోవాలని ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అద్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao)ను ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు మహేష్ కుమార్ పల్లా శ్రీనివాసరావు నోటీసు ఇచ్చారు. ఐదు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫాం హౌస్ లో 14న జరిగిన ఘటనలో మత్తుపదార్థాలు తీసుకున్నారని మీపై వచ్చిన ఆరోపణల్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్రభంగం కలిగించేవిగా ఉన్నాయని భావిస్తోంది అని అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








