2028 నాటికి అన్ని కోల్ బాక్స్ మూసేస్తాం : కిషన్ రెడ్డి
నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి వారం బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రధాని మోదీ (Modi) పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గతంలో రూ.1.89 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన కోల్ మైన్స్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతంలో బొగ్గును చైనా (China), ఆస్ట్రేలియా, ఇండోనేషియా (Indonesia) నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తాం. 2028 నాటికి అన్ని కోల్ బ్లాక్ సేస్తాం. క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రయోగానికి రూ1,500 కోట్లు కేటాయించాం. 24 క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్స్ బ్లాక్ తీసుకున్నాం అని అన్నారు.








