ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : కిషన్ రెడ్డి
ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్నారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణ (Telangana)లో ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిలా నేను పది పార్టీలు మారాలేదు. నా పుట్టుక చావు రెండు బీజేపీ (BJP)లోనే. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎంత రెచ్చగొట్టినా తొందరపడను. అన్నింటికీ సమయమే సమాధానం చెబుతుంది. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. దళితులు, బీసీలు మీ ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారు అని అన్నారు.








