తెలంగాణకు ఆ పరిస్థితి రావొద్దు : సీఎం రేవంత్ హెచ్చరిక
మాదకద్రవ్యాల వినియోగం కేసుల్లో ఎంత పెద్ద స్థాయి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. హైదరాబాద్ నగర పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పందన- తక్షణ రక్షణ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎం ప్రారంభించారు. స్పందన-తక్షణ రక్షణ పోస్టర్‌ను ఆవిష్కరించారు.అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, పెద్ద స్థాయి అధికారులు, సెలబ్రిటీలు (Celebrities), వారి కుటుంబ సభ్యులున్నా కచ్చితంగా అరెస్టు (Arrest) చేసి జైల్లో పడేయాలని పోలీసులను అదేశించారు. పెద్దవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే, మిగతావారిలో భయం కలుగుతుందని అన్నారు. మహిళలపై హింస, నేరాలకు పాల్పడుతున్న వారిలో 80 శాతం డ్రగ్స్, గంజాయి బానిసలే ఉంటున్నారని తెలిపారు.
ఒకప్పుడు పంజాబ్ (Punjab) రాష్ట్రం పౌరుషానికి ప్రతీక. ఇప్పుడు డ్రగ్స్ మత్తులో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణకు ఆ పరిస్థితి రావొద్దు. మత కలహాలు జరగకుండా గతంలో కీలక పాత్ర పోషించిన పీస్ కమిటీలను మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములను చేయాలి అని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న సమయంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని, అందుకోసం అడ్మిషన్ ఫారంలో ప్రత్యేకంగా ఒక కాలమ్‌ను చేర్చాలని కోరారు. హైదరాబాద్‌లో ఆపదలో ఉన్న మహిళలు డయల్-100, 112కు ఫోన్ చేస్తే.. స్పందన టీమ్ వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. మహిళా సాధికారతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి








