రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తాం : ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదని కవిత (Kavitha) అంటున్నారని, కానీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కాల్యాణ్ (Pawan Kalyan)కు సంబంధించిన భూములపై కవిత దగ్గర ఆధారలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైడ్రా ద్వారా రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాలకు ద్వారాలు తెరిచి అవినీతి చేసింది. వాటిపై కవిత మాట్లాడాలి. కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) భూ కబ్జాలకు పాల్పడి బినామీల పేరిట వాటిని మార్చిన విషయం ఆమెకు తెలుసు. టీఆరఎస్కు ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే అసత్య ఆరోపణలు చేస్తూ కాలం వెలదీస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఆధారాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని అన్నారు.








