YS Vijayamma: యలహంక షర్మిలదే, విజయమ్మ సంచలనం!!
2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని స్పష్టం చేసారు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే అంటూ స్పష్టం చేసారు.
అందుకే జగన్(YS Jagan) ఎంవోయూ(MOU) రాసారన్నారు. నిజానికి తనకు తక్కువే రాశాడని.. సరస్వతి సిమెంట్ తో సహా ఎంవోయూ లో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల(Ys Sharmila) వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమేనన్నారు. ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ పేర్కొన్నాడు. ఆస్తుల పంపకం జరగ లేదన్నారు విజయమ్మ.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్కు కూడా ఇచ్చారని, అది ఆస్తి పంపకం కాదన్నారు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమని పేర్కొన్నారు. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను అన్నారు. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి








