Y.S. Jagan: రాజధాని ప్లాన్ బీ పేరిట వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రాజధాని అంశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ (Y.S. Jagan) కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతి (Amaravati)కి బదులుగా కొత్త రాజధానిని ఆయన ప్రతిపాదించారు. మీడియా సమావేశంలో రాజధానికి ప్లాన్ బీ పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం (Machilipatnam) నుంచి విజయవాడకు దూరం 70 కి.మీ. విజయవాడ (Vijayawada) నుంచి గుంటూరుకు 40 కి.మీ. ఈ ప్రాంతంలో మొత్తం 110 కి.మీ హైవే ఉంది. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








