Y.S. Sharmila: ఇండియా కూటమి తీర్మానానికి జగన్ మద్దుతివ్వాలి : షర్మిల
ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్వర్ (Gyaneshwar) పై ఇండియా కూటమి పెట్టే అభిశంసన తీర్మానానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం జామి, అల్లూరి జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, వైసీపీ దొంగ ఏడ్పులు ఏడ్చింది. ఇప్పుడు అదే సీఈసీ పై అభిశంసన పెట్టే తీర్మానంపై మాత్రం వైసీపీ ఎంపీలు సంతకాలు పెట్టలేదు? అని ప్రశ్నించారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమి పెట్టిన అభిశంసన తీర్మానంపై తన ఎంపీలతో సంతకాలు పెట్టించాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) తన చేతుల్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తోంది అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








