Union Budget: కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ.1,561 కోట్లు
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో (Union Budget) రూ.1,561 కోట్లు కేటాయించారు. ఇందులో ఆసియా అభివద్ధి బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ.1,128.91 కోట్లు, ప్రపంచ బ్యాంకు సంస్థ ఐబీఆర్డీ (IBRD) నుంచి రూ.432.09 కోట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చి, రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించిన కొన్ని నెలలకే ఏడీబీ (ADB), ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా రూ.15,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. వాటిలో ఆ బ్యాంకులు ఇస్తున్నది రూ.13,500 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.1,500 కోట్లు సమకూరుస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.1,500 కోట్లలో రూ.750 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మిగతా నిధి మార్చి నెలాఖరులోగా ఇస్తుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






