Nara Devansh: సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక
నారా, నందమూరి కుటుంబాలు సంస్కృతి-సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయి. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబం మధ్యలో సాధారణంగా, శాస్త్రీయంగా నిర్వహించారు.
తాతల మురిపెం..
అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు..
అమ్మానాన్నల ప్రేమ..
మేనమామ ఆత్మీయత..
బంధుమిత్రుల ఆశీస్సులతో .. దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది.

హైదరాబాద్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్‌ను ఆశీర్వదించారు.








