Supreme Court: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు తదుపరి దర్యాప్తు పై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సీబీఐ(CBI) ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వును సవరించి, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే దానికి ఎలాంటి అడ్డంకులు లేవని జస్టిస్ ఎంఎం సుందరేశ్ (Justice MM Sundaresh) స్పష్టం చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఆ విషయం స్పష్టంగా ఉన్నందున యథాయథంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






