Pentagon: ఇరాన్‌పై భూతల దాడి వద్దు.. అది అమెరికాకే నష్టం: స్టీవ్ ఆండర్సన్
Pentagon: ఇరాన్‌పై భూతల సైనిక చర్యకు పెంటగాన్ సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో, అమెరికా సైన్యానికి చెందిన విశ్రాంత బ్రిగేడియర్ జనరల్ స్టీవ్ ఆండర్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యాన్ని పంపడం అనేది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద భౌగోళిక రాజకీయ విపత్తుగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
మాజీ జనరల్ హెచ్చరికలోని అంశాలు:
ఘోర తప్పిదం: ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆండర్సన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఆయన సలహాదారులు ఈ యుద్ధాన్ని తప్పుగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. హోర్ముజ్ జలసంధిలోనైనా లేదా ఇరాన్ అణు కేంద్రాల వద్దకైనా సైనికులను పంపడం వల్ల అమెరికన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి
శత్రువును అంచనా వేయడంలో విఫలం: సైనిక వ్యూహాల్లో శత్రువు బలాబలాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఇరాన్ శక్తిని సరిగ్గా అంచనా వేయలేకపోతోందని ఆయన వాదించారు. ఇరాన్ తన మనుగడ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుందని, ఇది అత్యంత కఠినమైన యుద్ధం అవుతుందని పేర్కొన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైన్యం: అమెరికా సైన్యం విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నప్పటికీ, ట్రంప్ సైన్యాన్ని తన సొంత ‘ప్రైవేట్ మిలీషియా’లా వాడుకుంటున్నారని ఆండర్సన్ ఆరోపించారు.
దౌత్యమే మార్గం: సమస్య పరిష్కారానికి దౌత్య మార్గాలను అన్వేషించాల్సింది పోయి, బలవంతంగా సైన్యాన్ని రంగంలోకి దించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
ఇరాన్ లోపలికి సైన్యాన్ని పంపే నిర్ణయం తీసుకుంటే అది అమెరికా చేసే అతిపెద్ద పొరపాటుగా మిగిలిపోతుందని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి








