Donald Trump: అమెరికా రాదు.. అండగా ఉండదు.. హర్మూజ్‌పై మీరే యుద్ధం చేయండి: ట్రంప్
Donald Trump: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హర్మూజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ మిత్రపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అమెరికా చేస్తోన్న పోరాటంలో కలిసిరాని దేశాలకు, ముఖ్యంగా బ్రిటన్ (UK) వంటి మిత్రదేశాలకు ఆయన సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు.
ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు:
హర్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు కొరత ఎదుర్కొంటున్న దేశాలకు ట్రంప్ రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు.
అమెరికా నుండే చమురు కొనాలి: అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అవసరమైన వారు తమ వద్ద నుండే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ధైర్యం చేసి స్వాధీనం చేసుకోండి: ఇతర దేశాలపై ఆధారపడటం మానేసి, ధైర్యం కూడగట్టుకుని హర్మూజ్ జలసంధికి వెళ్లి దానిని మీ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు.
మీ కోసం మీరే పోరాడాలి:
“ఇరాన్ దాదాపుగా నాశనమైంది, కష్టమైన పనిని అమెరికా పూర్తి చేసింది. కానీ మాకు అండగా నిలవని దేశాలకు సహాయం చేయడానికి అమెరికా రాదు. మీ కోసం మీరు పోరాడటం నేర్చుకోవాలి. వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి” అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. యుద్ధ సమయంలో తమ పిలుపును నిరాకరించిన దేశాలు ఇకపై తమ శక్తితోనే ఇంధన అవసరాలను తీర్చుకోవాలని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి








