Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డికి.. సుప్రీంకోర్టు లో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy )కి సుప్రీంకోర్టు (Supreme Court) లో చుక్కెదురైంది. కెసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి (Upendra Reddy) , రాజ్ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్ర రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన అరెస్టు అక్రమమని రాజ్ కెసిరెడ్డి దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సీఐడీ (AP CID) కి లేదని అందులో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసింది. వాటిని కొట్టివేస్తున్నట్లు తాజాగా తీర్పు వెలువరించింది.













