జగన్ నేర చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో : మంత్రి సంధ్యారాణి
ఎవరినైనా చంపు దోచుకో దాచుకో అనేదే వైసీపీ సిద్ధాంతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి (Sandhyarani) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan) అండ ఉందనే సుబ్రహ్మణ్యం (Subrahmanyam) ను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu) డోర్ డెలివరీ చేశారని ఆక్షేపించారు. జగన్ నేర చరిత్రలో ఇలాంటి ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయని, దళితుల్ని, పేదల్ని హత్య చేయటం, భూములు లాక్కోవడం జగన్ తాతముత్తాతల నుంచి వస్తున్న రక్త చరిత్ర అని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మాజీ మంత్రి వివేకా (Viveka) హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపించిన వారికి సాక్షులను చంపించడం పెద్ద విషయమా? అని వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతోనే వెళ్లట్లేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని చెప్పారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే మావిగన్ పేరు తెచ్చారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి








