Minister Kondapalli : మంత్రి కొండపల్లికి అంతర్జాతీయ పురస్కారం
యూఎస్-ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ అందించే అంతర్జాతీయ పురస్కారం ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు (The Presidents Volunteer Service Award) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు(Kondapalli Srinivas) లభించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని కౌన్సిల్ ప్రకటించింది. వాషింగ్టన్ డీసీ (Washington D.C.) ప్రధాన కేంద్రంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివద్ధి కోసం ఈ కౌన్సిల్ పనిచేస్తోంది. అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే పురస్కారాన్ని కౌన్సిల్ సీఈవో / ప్రెసిడెంట్ ఎలీషా బి. పులివర్తి (Elisha B. Pulivarthi) మంత్రి శ్రీనివాస్‌కు అందజేశారు. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల బలోపేతం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, సెర్ప్ ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాల పెంపు, స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేయడం తదితర అంశాల్లో చేసిన కషికి ఈ అవార్డు దక్కిందని మంత్రి కొండపల్లి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






