Markapuram:మార్కాపురం బస్సు ప్రమాద ఘటన.. యజమాని, డ్రైవర్ అరెస్టు
మార్కాపురం (Markapuram) బస్సు ప్రమాద ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాని హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy), డ్రైవర్ యువరాజ్ (Yuvaraj) ను పోలీసులు అరెస్టు చేశారు. వేరేవారికి అధిక జీతం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే లైసెన్స్ లేని యువరాజ్ ను ట్రావెల్స్ యాజమాన్యం డ్రైవర్గా పెట్టుకున్నట్లు డీఎస్పీ నాగరాజు (Nagaraju) మీడియా సమావేశంలో వెల్లడించారు.ఎనిమిది నెలల క్రితం సెకండ్ హ్యాండ్ బస్సును హరికృష్ణ రెడ్డి కొనుగోలు చేశారు. బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసినా నడిపిస్తున్నారు. ఈ బస్సు వినుకొండ మీదుగా గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంది. ప్రయాణంలో తరచూ రిపేరు వస్తుండటంతో జాతీయ రహదారి మీదుగా మార్కాపురం వైపు మళ్లించారు అని డీఎస్పీ వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గత నెల 26న రాయవరం వద్ద టిప్పర్ను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 29 మందికి గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి








