Kishan Reddy: అమరావతికి తెలంగాణ తరపున సంపూర్ణ మద్దతు : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చ తెలంగాణ ఎంపీల మధ్య వాగ్వాదాలకు దారితీసింది. బిల్లుకు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించినా, విభజన హామీల విషయంలో పరస్పరం మాటలు రువ్వుకున్నారు. లోక్ సభలో కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి గత పదేళ్ల బీఆరఎస్, గత రెండేళ్ల కాంగ్రెస్ (Congress) పాలనలే కారణమని ఎదురుదాడి చేశారు. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలు , ఖండనల క్రమం కొనసాగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని, ప్రధాని మోదీ దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో 8 ఎయిర్పోర్టులను గతంలో కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఒకే ఎయిర్ పోర్టు ఉండటం ఎవరి పొరపాటని ప్రశ్నిస్తున్నా. మోదీ (Modi) వచ్చిన తర్వాత భోగాపురంలో అద్భుతమైన ఎయిర్ పోర్టు నిర్మితమవుతోంది. కానీ కొత్తగూడెం, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్టుల కోసం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆరఎస్ భూమి కేటాయించలేదు. వరంగల్లో ఎయిర్పోర్టు కోసం నేను గతంలో లేఖలు రాస్తే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అనుమత్విలేదు అని అన్నారు.ఏపీ రాజధానిగా అమరావతికి తెలంగాణ ప్రజల తరపున మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాను. ఈ నగరం కూడా అభివద్ధి జరగాలని కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా మెలగుతూ అభివృద్ధి లో పోటీపడాలి అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








