Minister Ponnam: ఏపీ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)కి చట్టబద్ధత బిల్లు లోక్ సభ లో ఆమోదం పొందడాన్ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్వాగతించారు. ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వివక్ష చూపుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ (Bayyaram Steel Plant), కాజీపేట రైల్వే కోచ్ (Kazipet Railway Coach) ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








