Srilakshmi: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి.. సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (Srilakshmi) కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. హైకోర్టు (High Court) తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది. 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. 2022లో హైకోర్టులో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ (Discharge ) చేసిన విషయం తెలిసిందే. ఆ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.













