AP: ఆంధ్రప్రదేశ్ లో ‘‘డిజి రైతు బజార్’’.. ఇంటి వద్దకే కూరగాయలు
. ఇప్పుడంతా నడుస్తోంది ‘‘ఆర్డర్ల దునియానే’’. ఏది కావాలన్నా ఆర్డర్ చేస్తే చాలు మన ముందు వచ్చి వాలుతుంది. అయితే.. రైతులకు సంబంధించినంత వరకూ ఈ టెక్నాలజీ ఇంకా అంతగా అందుబాటులోకి రాలేదు. దీంతో రైతులు అంతగా లాభం పొందలేకపోతున్నారు. రైతులకు కూడా టెక్నాలజీ ద్వారా లాభం తెప్పించాలని ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రయోగంతో ముందుకు వచ్చింది.
రైతు బజార్లు వచ్చిన తర్వాత తాజా తాజా కూరగాయలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో కూడా ప్రజలకు కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రైతు బజార్ పై ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వీటిని మరింత ప్రజలకు చేరువ చేసేందుకు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రైతు బజార్ వద్ద ‘‘డిజి రైతుబజార్ ఫ్లెక్సీ’’ ని ఏర్పాటు చేసింది.
యాప్ లో ఆర్డర్ పెట్టేసుకుంటే.. కూరగాయలు, ఇతర వస్తువులు నేరుగా మన ఇంటికి వచ్చేస్తాయి. ‘‘డిజి రైతు బజార్’’ పేరుతో వెబ్ సైట్, యాప్ ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీనిని వాడుకోవాలంటే డిజి రైతు బజార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.
ఇవి కూడా చదవండి
ఈ యాప్ లో కూరగాయలతో పాటు రైతు బజార్లలో లభించే పండ్లు, ఇతర వస్తువులు కూడా ఇందులో చూపిస్తుంది. కేవలం కూరగాయలే కాక.. రైతు బజార్ లో లభించే ప్రతి వస్తువునూ ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వాటిని ఆర్డర్ పెడితే.. రైతు బజార్ నుంచి నేరుగా మన మన ఇళ్లకే తెచ్చి, డెలివరీ చేసేస్తారు. ఏపీ మార్కెటింగ్ శాఖ, మాచిట్ అనే సంస్థ సంయుక్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం ఈ యాప్ సేవలు కేవలం విజయవాడ సిటీ పటమట రైతు బజార్ లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అలాగే విశాఖపట్నంలోని 11 రైతు బజార్ లలో, కాకినాడ, గుంటూరులో ఒక్కో రైతు బజార్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటి ద్వారా కూరగాయలను అందిస్తున్నారు. క్రమ క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా డిజి రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులో తేవాలని నిర్ణయించారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డిజి రైతు బజార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి
-మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి
-మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వండి
-రైతు బజార్‌ను ఎంచుకుని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ను యాడ్ చేయండి
-ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయండి
-క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంది
-కొన్ని నిమిషాల్లోనే మీకు డోర్ డెలివరీ చేస్తారు
-మినిమం రూ.100 విలువ చేసేవి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది
-రూ.100 మించితే జీఎస్టీ, హ్యాడ్లింగ్, డెలివరీ ఛార్జీలు రూ.49 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి







