బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు : సీఎం చంద్రబాబు హెచ్చరిక
రాష్ట్రంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కృత్రిమ కొరత సృష్టిస్తే, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల కొరతపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ సమస్య పరిష్కారానికి ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలన్నారు. ప్రతి మÖడు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియా (Social Media)లో వస్తున్న వార్తలపై స్పందించాలని సూచించారు. సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు.
ఇవి కూడా చదవండి








