రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ సాయిప్రసాద్ (Sai Prasad), ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ లో వరుస సమీక్షలు నిర్వహించారు. డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా ఉండేలా చూడాలని, ఇంధన సంక్షోభం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, సోమవారం నాటికి ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు (No Stock Boards) కనిపించకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వరి కోత యంత్రాలకు డీజిల్ (Diesel) కొరత రానివ్వొద్దన్నారు. ఎక్కడా బ్లాక్లో పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జరగడానికి వీల్లేదని చెప్పారు. రిటైలర్లకు క్రెడిట్ విషయంలో ఉన్నట్టుండి పాలసీ మార్చడం ఏంటని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను నిలదీశారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనే వరకు రెవెన్యూ, పోలీసు, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








