ఇది ప్రారంభం మాత్రమే.. మహిళా లోకమంతా ఏకమైంది : సీఎం చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ (Congress), మిత్ర పక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయి. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహం. మహిలను గౌరవించి, అన్ని రంగాల్లో ఆదరించడం మన సంస్కృతి. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. మహిళా లోకమంతా ఏకమైంది. చిన్న రాష్ట్రాలకు (Small States) నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. మహిళల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించారని నేరం. విపక్ష పార్టీలే ఎన్నికల్లో ఏ ముఖ్యం పెట్టుకుని ఓట్లు అడుగుతాయి అని అన్నారు.






