AP: ఏపీ పారిశ్రామిక దిశను మార్చేయనున్న ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ సంస్థలు.. 70 వేల కోట్లతో భారీ పరిశ్రమ
ఏపీలో మరో భారీ పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ తో నక్కపల్లి ప్రాంతంలో మరో గాజువాక కావడం ఖాయం అంటున్నారు. స్టీల్ ప్లాంట్ రావడంతో భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఆశాభావంతో వున్నారు.
నక్కపల్లి దగ్గర మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో ఏకంగా లక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో అనుబంధంగా మరికొన్ని యూనిట్లు కూడా రాబోతున్నాయని.. కొత్తగా మరో పోర్టు కూడా కూడా ఏర్పాటవుతుంది అంటున్నారు. మిట్టల్ స్టీల్‌ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ సంస్థలు స్టీల్ ప్లాంట్‌ను మొత్తం రూ.1.35 లక్షల కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాయి. తొలి విడతలో ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఈ గ్రామాల పరిధిలోని 2,200 ఎకరాల్లో రెండు దశల్లో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నులు.. మొత్తం 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. ఇక ముడి సరుకుల దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి కోసం పోర్టు నిర్మిస్తారు. ప్లాంట్‌కు కేటాయించిన భూమి నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీ కోసం నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఉక్కు కర్మాగారం వస్తే దానిపై ఆధారపడే వందలాది చిన్న తరహా పరిశ్రమలు చుట్టుపక్కల ఏర్పడతాయి. తద్వారా పరోక్ష ఉపాధి భారీగా పెరుగుతుంది. ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ సంస్థలు ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఈ సంస్థ బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, పోలాండ్, కెనడా మరియు దక్షిణ ఆఫ్రికా వంటి అనేక దేశాలలో ఉక్కు కర్మాగారాలను నిర్వహిస్తోంది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఫ్రాన్స్‌లోని డన్కిర్క్లో 1.3 బిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) ను నిర్మిస్తోంది.
సోమవారమే భూమి పూజ…
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి ఈనెల 23వ తేదీన (సోమవారం) భూమిపూజ చేయనున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి







