ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ( ఎసఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునేఠా (Anil Chandra Punetha)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 198 బ్యాచ్ ఐఏఎస్ (IAS) అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ (TDP) ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పునేఠాను విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని (Neelam Sahni) ఐదేళ్ల పదవీకాలం గత నెల 31తో ముగిసిన నేపథ్యంలో ఎసఈసీగా పునేఠాను నియమించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








