TTD: శ్రీవారి ఆలయం ఎదుట ఏఐ ఎఫ్ఆర్ సీ కెమెరాలు
శ్రీవారి భద్రతా చర్యల్లో భాగంగా ఏఐ (AI) ఆధారిత ఫేస్ రికగ్నేషన్ కెమెరా(ఎఫ్ఆర్ సీ)లను ఆలయ సరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఇటీవల రథసప్తమి రోజున ఈ అధునాతన కెమెరా (Camera)లను మాడవీధుల్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటితో రద్దీ అంచనాలతోపాటు ఎంతమంది భక్తులు వాహన సేవలు దర్శించుకున్నారనే దానిపై కచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం (Sri Vari Temple) వద్ద వీటిని ఏర్పాటు చేశాక వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమండ్ కంట్రోల్ కేంద్రాన్ని అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సమాచారం ఉన్నతాధికారులకు అందుబాటులోకి రానుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






